దేశమే ఫస్ట్.. వ్యక్తిగతం లాస్ట్ … మోదీ పై ప్రశంసలు
ఓ వైపు మాతృమూర్తి మరణించారన్న బాధ గుండెలను తోడేస్తున్నా అంత్యక్రియల్లో పాల్గొని ఒక కుమారిడిగా తన బాధ్యతను నెరవేరుస్తూనే, దేశం కోసం పట్టు సడలి కృతనిశ్చయంతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ నిజమైన కర్మయోగి అని బీజేపీ నేతలు ప్రశంసించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మోదీ హుటాహుటిన గుజారాత్‌కు వెళ్లారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం హావ్‌డా, న్యూ జల్‌పయ్‌గురిని కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సహా, పశ్చిమబెంగాల్లోని దాదాపు రూ.7,8000 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించాల్సి ఉంది. తల్లి మృతి చెందిన నేపథ్యంలో కోల్‌కతా పర్యటనను రద్దు చేసుకున్న మోదీ వర్చువల్‌గా ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఆయన నిబద్ధతను బీజేపీ నేతలు ప్రశంసిస్తున్నారు.
అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని గుజరాత్‌కు రావొద్దని ప్రధాని మోదీ ఇతర మంత్రులు, నేతలకు సూచించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కేరళలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసుకోవద్దని ప్రధాని మోదీ చెప్పారన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే ఢల్లీికి రావాలని చెప్పారన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ముందస్తు షెడ్యూల్ ప్రకారం కర్ణాటక వెళ్లారు. మరోవైపు అధికారిక కార్యక్రమాల్లో మోదీ వర్చువల్‌గా పాల్గొన్న ఫొటోలను పలువురు బీజేపీ నేతలు పోస్టూ చేస్తూ దేశమే ముందు.. తర్వాత ఏదైనా అంటూ ఆయన్ని ప్రశంసించారు.













