ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆగస్టు ఒకటవ తేదీన ప్రధానికి పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (టీఎస్ఎంసీ) ప్రకటించింది. దేశాన్ని పురోగతి పట్టాలెక్కించి, పౌరుల్లో దేశభక్తి భావాన్ని జాగృతం చేసి, భారత్‌ను అంతర్జాతీయ మ్యాప్‌పై ఉంచడంలో ఉపకరించే ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమానికి గాను నరేంద్ర మోదీకి పురస్కారం ప్రధానంం చేస్తున్నట్లు టీఎస్ఎంటీ ట్రస్టీలైన అధ్యక్షుడు డాక్టర్ దీపక్ జే తిలక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ తెలిపారు. స్వతంత్ర సమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 103వ వర్థంతిని పురస్కరించుకొని ఆగస్టు ఒకటవ తేదీన పూనెలో తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్‌లో జరిగే ఒక వేడుకల్లో ప్రధాని మోదీని డాక్టర్ తిలక్ సన్మానిస్తారు. రూ.లక్ష రూపాయల కేస్, ఒక జ్ఞాపిక, ధృవీకరణ పత్రంతో కూడిన పురస్కారాన్ని మోదీకి అందిస్తారు.













