భారతీయుల స్పూర్తికి ఇది సాక్ష్యం : మోదీ
కరోనాపై పోరాటంలో ఇండియా అసాధారణ మైలురాయిని అందుకున్నది. దేశవ్యాప్తంగా వంద కోట్ల కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియా చరిత్ర సృష్టించినట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. భారతీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తికి ఇది సాక్ష్యమని అన్నారు. వ్యాక్సినేషన్లో వంద కోట్లు దాటిన నేపథ్యంలో దేశ ప్రజలు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ఈ అద్భుతమైన ఘనత సాధన కోసం కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.













