దేశంలో తొలి వాటర్ మెట్రో ప్రారంభించిన మోదీ
దేశంలో కేరళ లో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కోచి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అంతకుముందు మోదీ ఆ రాష్ట్రంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపారు. ఇది తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకు రాకపోకలు సాగిస్తుంది. అంతేగాకుండా డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపనేశారు. ఈ అభివృద్ధి కార్యాక్రమాల ప్రారంభాల్లో భాగంగా మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ రోజు కేరళ కు మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అలాగే కోచిలో వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేరళ విద్యావంతుల రాష్ట్రం. ఇక్కడి ప్రజల కృషి, వినయం వారి గుర్తింపులో భాగం. దేశ రైల్వే నెట్వర్క్ వేగంగా మార్పు చెందుతోంది. అధిక వేగం కలిగిన రైళ్ల రాకపోకలకు సిద్ధం అవుతోంది. రాష్ట్రాల అభివృద్దే దేశ ప్రగతికి మూలమని మా ప్రభుత్వం నమ్ముతోంది అని మోదీ తెలిపారు.













