నితీశ్ టీమ్ కు మోదీ అభినందదనలు
బీహార్లో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని విశ్వాసంతో ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని అభినందనలు తెలిపారు. బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. నా కుటుంబ సభ్యులైన బీహార్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి, రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధి, అంకితభావంతో కొత్త ప్రభుత్వం పనిచేస్తుందన్న నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.













