ఘనంగా పద్మ పురస్కారాల ప్రధానం
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన యాబై మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, వాస్తు శిల్పి బాలకృష్ణ దోషి ( మరణానంతరం) దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషన్‌ను అందుకున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా, రచయిత, ప్రొఫెసర్ కపిల్ కపూర్, ఆధ్మాత్మిక వేత్త, రామచంద్రమిన్ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్ (తెలంగాణ), నేపథ్య గాయని సుమన్ కల్యాణ్‌పుర్ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ను స్వీకరించారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేశ్ రaున్రaున్వాలా (మరణానంతరం)కు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన సతీమణి అందుకున్నారు. తెలంగాణ నుంచి పసుపులేటి హనుమంతరావు ( వైద్య రంగం), బి.రామకృష్ణా రెడ్డి ( సాహిత్యం, విద్య), డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా( సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ఆంధ్రప్రదేశ్ నుంచి చింతలపాటి వెంకటపతి రాజు ( కళారంగం), కోట సచ్చిదానంద శాస్త్రి (కళా రంగం), డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ రావు (సామాజిక సేవ), ప్రొఫెసర్ ప్రకాష్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య) పద్మశ్రీలు స్వీకరించారు.













