Om Birla: స్పీకర్ ఓం బిర్లాపై అభిశంసన తీర్మానానికి విపక్షాల సన్నద్ధం!
బడ్జెట్ సమావేశాల తొమ్మిదో రోజు కూడా పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై (Om Birla) ఏకంగా అభిశంసన తీర్మానం (Impeachment Motion) ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాంబర్లో జరిగిన కీలక సమావేశంలో విపక్ష నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.
ప్రధానంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకోవడం, ఆయన మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం వంటి చర్యలు స్పీకర్ (Om Birla) పక్షపాత వైఖరికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడికి ప్రణాళిక వేశారంటూ చేసిన నిరాధారమైన ఆరోపణలు కూడా విపక్షాల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ (Article 94-c) ప్రకారం స్పీకర్ను తొలగించేందుకు ఈ తీర్మానాన్ని తెరపైకి తెస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ తీర్మానంపై సుమారు 100 మంది ఎంపీలు సంతకాలు చేసే అవకాశం ఉంది. మంగళవారం నాడే ఈ నోటీసును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఖర్గే చాంబర్లో జరిగిన భేటీలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), ఆర్ఎస్పీ, లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. స్పీకర్ (Om Birla) తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. సభలో తమ గొంతును వినిపించేందుకే ఈ అస్త్రం ప్రయోగిస్తున్నట్లు విపక్ష నేతలు చెబుతున్నారు.













