భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు.. కొత్త రూల్స్
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వేరియంట్ కోరలు చాస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాలని సూచించింది. ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాక మళ్లీ కోవిడ్ పరీక్షలు చేయనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు రావాలనుకునే ప్రయాణికులు తమ 14 రోజుల ప్రయాణ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని నిబంధన విధించింది. ప్రయణానికి ముందు ఆర్టీటీ పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ను ఎయిర్ సువిధ పోర్టల్ అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది. ఈ నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.













