ఇండియా కూటమి కన్వీనర్ గా నీతీశ్ కుమార్!
విపక్షాల కూటమి ఇండియా కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే విపక్ష పార్టీలన్నీ వర్చువల్‌గా సమావేశమై ఈ మేరకు ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ నీతీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో చర్చించినట్లు తెలిపాయి. కూటమిలోని మిగతా పార్టీలతోనూ దీనిపై సంప్రదింపులు జరిగాయని, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా నీతీశ్ నియామకానికి తన మద్దతు ప్రకటించారని ఆ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతోనూ నీతీశ్ చర్చించినట్లు పేర్కొన్నాయి. కూటమిలో రెండు అత్యున్నత హోదాలుగా కన్వీనర్, చైర్పర్సన్ పోస్టులు ఉంటాయని, కాబట్టి నీతీశ్‌ను కన్వీనర్‌గా నియమించే విషయంలో కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.













