తెలుగు రాష్ట్రాలకు సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్

కరోనా ఉధృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‍లతో ప్రధాని మోదీ ఫోన్‍లో మాట్లాడారు. కరోనా వైరస్ తీవ్రత, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. వ్యాక్సిన్ పంపిణీ తీరు, ఆక్సి•న్ కొరత వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామని, బాధితులకు సంపూర్ణ వైద్య సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతతో పాటు కట్టడి చర్యలపై ఇరువురూ చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా, కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍తో పాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్ము-కశ్మీర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్లతోనూ మోదీ ఫోన్‍లో చర్చించారని పీఎంఓ వర్గాలు తెలిపాయి.