ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో ప్రధాని మోదీ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ భవనంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. రాజ్యసభ 264వ సమావేశాలు ముగిసిన అనంతరం జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రాజ్యసభ సమావేశాలు సాగిన తీరుపైనా ఈ సందర్భంగా వారు చర్చించారని సమాచారం.