రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢీల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. దీంతో ఈ నెల 10 వరకు సమయం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.













