విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా.. మార్గరెట్ అల్వా
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా(80) బరిలో నిలిచారు. ఈ మేరకు ఆమె పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. 17 పార్టీలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించాయని తెలిపారు. రేపు (19వ తేదీన) అల్వా నామినేషన్ వేస్తారని పేర్కొన్నారు. పవార్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. అనంతరం అల్వాను ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పవార్ వెల్లడిరచారు. అల్వాకు మద్దతు ఇవ్వాల్సింది తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కోరానున్నాం. ఈ క్రమంలో వారిని కలిసిసేందుకు ప్రయత్నిస్తాం. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి వారు ఇటీవలే మద్దతు ప్రకటించారు. జేఎంఎం కూడా విపక్ష పార్టీలకే మద్దతు తెలుపుతున్నదని అని పవర్ పేర్కొన్నారు.













