చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే… జవాన్ ను వదిలేస్తాం
ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల చేతిలో బందీగా మారిన కోబ్రా కమాండో రాకేశ్ మన్హాస్ ఫొటోను నక్సల్స్ విడుదల చేశారు. కాగా అతడు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అడవిలో తాటాకులతో వేసిన చిన్న గుడిసెలో, కింద ప్లాస్టిక్ కవర్‌పై రాకేశ్‌సింగ్ కూర్చొని ఉన్న ఫొటోని విడుదల చేసింది. చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్‌ను వదిలేస్తామని నక్సల్స్ షరతు విధించారు. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిది వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. బీజాపూర్- సుకుమా జిల్లా సరిహద్దు అటవీప్రాంతంలో ఈ నెల 3వ తేది రాత్రి సైనికులకు, మావోయిస్టులకు మధ్య బీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 23 మంది సైనికులు మృతి చెందారు.
మావోయిస్టుల్లోనూ భారీగానే ప్రాణనష్టం జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ ఘటనలో కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్‌సింగ్ అనే కమాండో కనిపించకుండాపోయారు. అయితే ఆ జవాను తమ చెరలో ఉన్నట్లు నక్సలైట్లు పేర్కొన్నారు. సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించారు. అయితే మావోయిస్టులతో చర్చలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఏటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో రాకేశ్వర్ మావోయిస్టులకు చిక్కిన విషయం తెలిసిందే.













