తీహార్ జైలుకు మనీశ్ సిసోడియా
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అమెన్యూ కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. అవినీతి కేసులో గత నెల 26 సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న సిసోడియాను నేడు ఢల్లీి రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించి సిసోడియా నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దాంతో కోర్టు మార్చి 20 వరకు సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది. కోర్టు తీర్పుతో మార్చి 20వ తేదీ వరకు సిసోడియా తీహార్ జైలులో ఉండనున్నారు.













