కావాలంటే తన తల నరుక్కుంటాను… కానీ
ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి బీజేపీలో చేరితే అప్పుడు తనపై ఉన్న అన్ని కేసులను ఆ పార్టీ మూసివేస్తుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. బీజేపీ నుంచి తనకు ఓ మెసేజ్ వచ్చిందని, ఆప్‌ను బ్రేక్ చేసి, బీజేపీలో చేరాలని ఆ మెసేజ్‌లో ఉందని, మీపై ఉన్న అన్ని సీబీఐ, ఈడీ కేసులను తొలగిస్తామని ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు సిసోడియా తెలిపారు. తనపై అన్ని తప్పుడు కేసులు బనాయించారని, మీకు కావాల్సింది మీరు చేసుకోవాలని బీజేపీకి ఆయన హెచ్చరిక జారీ చేశారు. మహారాణా ప్రతాప్ అనుచరుడిని అని రాజ్‌పుత్ అని కావాలంటే తన తల నరుక్కుంటాను కానీ, అవినీతి నేతలకు తొంగిపోనని, తనపై ఉన్న కేసులన్నీ అక్రమైనవని తెలిపారు.













