ఆజాద్ స్థానంలో మల్లికార్జున్ ఖర్గే!
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే ఆజాద్ పదవీకాలం ఈ నెల 15తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో ఖర్గే పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ రాజ్యసభలో భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆజాద్‌తో పాటు నజీర్ అహ్మద్ లవాయ్(పీడీపీ) పదవీ కాలం కూడా 15తో ముగియనుంది.













