కీలకమైన బీజేపీ నేతలను హతమారుస్తాం… బెదిరింపు ఈమెయిల్ కలకలం
కీలకమైన బీజేపీ నేతలను హతమారుస్తాం అంటూ వచ్చిన ఈ మెయిల్ బెదిరింపు కలకలం రేపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలను పదవుల నుంచి తొలగించండి లేదా చంపేస్తాం అంటూ ఈ మెయిల్ వచ్చింది. ముంబైలోని సీఆర్పీఎఫ్ ఆఫీస్కు ఈ ఈమెయిల్ వచ్చింది. ఆత్మాహుతి దాడుల ద్వారా ఆ ఇద్దరినీ చంపేస్తామంటూ ఆ మెయిల్లో హెచ్చరించారు. 11 మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, వారి ద్వారా యోగీ, షాలను అంతం చేస్తామని అందులో పేర్కొన్నారు. అంతేకాదు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోనూ దాడులు చేస్తామని హెచ్చరించడం గమనార్హం. అయితే ఈమెయిల్ ఎక్కడనుంచి వచ్చింది అనే దానిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.













