ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్

మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.