కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన… ప్రజలు తప్పనిరిగా
చైనా, అమెరికా సహా పలు ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో మన దేశంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్‌సభ లో కీలక ప్రకటన చేశారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని మంత్రి వెల్లడిరచారు. కొత్త వేరియంట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జులై`నవంబర్ మధ్య కాంలో మన దేశంలో బీఎఫ్ 7 రకానికి చెందిన నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.













