కాంగ్రెస్ కు భారీ షాక్… పార్టీ సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కపిల్ సిబల్ పార్టీకి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ మద్దతుతో యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ కూడా దాఖలు చేసేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కపిల్ సిబల్ వెంట సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా అధికారికంగా సిబాల్ సమాజ్వాదీ సభ్యత్వం కూడా తీసుకోనున్నారని సమాచారం. అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశానని, అయితే సమాజ్వాదీ పార్టీ తనకు మద్దతిస్తోందని సిబల్ పేర్కొంటున్నారు.













