రాజకీయాలకు కమల్‌నాథ్ గుడ్‌బై ?
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. చింద్వారాలో జరిగిన ఓ ర్యాలీలో కమల్‌నాథే పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను.. రాజకీయ జీవితంలో ఎన్నో సాధించాను. ఇంకా సాదించాలన్న ఆశలు లేవని కమల్ నాథ్ సృష్టం చేశారు. కమల్‌నాథ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, విధానసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత హర్పాల్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న రాహుల్ గాంధీ తక్షణమే తన పదవికీ రాజీనామా చేసిన విషయాన్ని ఠాకూర్ గుర్తు చేశారు. కమల్‌నాథ్ కూడా రాహుల్ మాదిరి వ్యవహరించాలని సూచించారు.













