సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీవీ నాగరత్న!
భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవిని ఒక మహిళ చేపట్టే సమయం ఆసన్నమైంది. త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఓ మహిళ చేపట్టనున్నారు. జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోయే మొదటి మహిళగా నిలవనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తదుపరి చీఫ్ జస్టిస్ రేసులో ఉన్న 9 మంది న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేసింది. వీరిలో బీవీ నాగరత్నతో పాటు మహిళ జడ్జిల్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నారు. ప్రసుత్తం కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టీస్ బీవీ నాగరత్నం పేరును కొలీజియం చేసింది. 2008లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
భారతదేశానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి కావాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీవీ నాగరత్నను ఆ పదవి వరిస్తే ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా మహిళ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని అభిప్రాయపడ్డారు.













