రాజకీయాలపై జయలలిత మేనకోడలు సంచలన ప్రకటన
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై వ్యవస్థాపక అధ్యక్షురాలు దీప రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. జయలలిత మరణం తర్వాత ఆమె రాజకీయాలకు, ఆస్తికి తానే వారసురాలినంటూ దీప గతంలో ప్రకటన చేశారు. అన్నాడీఎంకే ఆహ్వాన్ని తిరస్కరించి ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ను స్థాపించి రాజకీయ అరం గేట్రం చేశారు. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై మధ్యలో విరమించుకున్నారు. పేరవైలో కీలక బాధ్యతలను తన కారు డ్రైవర్‌కు అప్పగించడంతో ఆగ్రహించిన దీప భర్త మాధవన్ ఎంజేడీఎంకే అనే కొత్త పార్టీని స్థాపించారు. దీపను వీడి దూరంగా వేరే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీప పేరవైకి ఆశించినంతగా ప్రజల నుంచి ఆదరణ దక్కలేదు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. భవిష్యత్ల్లో మళ్లీ రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదని ప్రకటించారు.













