మోదీ ఒక ‘ఝూట్ జీవి’.. ఆయన్ను తిట్టే బాధ్యత అదే జాతి వాడికి ఎందుకిస్తాం?: జైరాం రమేశ్
తనను దూషించే బాధ్యతను కాంగ్రె పార్టీ అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చిందని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ తమపై చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ప్రధాని నోరు తెరిచిన ప్రతిసారీ అబద్ధాలు ప్రవాహంలా పారుతాయని, వాటిపైనే తాము గళమెత్తుతామని జైరాం రమేశ్ అన్నారు. అంతేకానీ తాము ఎవరినీ దూషించమని, ప్రధాని మాట్లాడే మోసపు మాటలనే విమర్శిస్తామని స్పష్టం చేశారు. ఒక అబద్దాల కోరు బండారం బయటపెట్టేందుకు అదే జాతికి చెందిన వాళ్లను ఎందుకు ఎంచుకుంటామని ప్రశ్నించారు.
https://twitter.com/Jairam_Ramesh/status/1580061598060019713













