భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుభవార్త!
ప్రమాదవశాత్తూ కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్నవాళ్లకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుభవార్త చెప్పింది. లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ కాలును అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. మైక్రో ప్రాపెసర్ ఆధారంగా పనిచేసే (ఎంపీకే) ఈ కాలును త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తామని వెల్లడిరచింది. ఒకటిన్న కిలోల బరువుండే ఈ కాలులో మైక్రో ప్రాపెసర్, హైడ్రాలిక్ డ్యాంపర్, మోకాలి సెన్సార్, మోకాలి కేస్, లిథియం అయాన్ బ్యాటరీ పరికరాలు ఉంటాయి. వ్యక్తి శరీర కండరాల నుంచి సిగ్నళ్లను గ్రహించి ముందుకు వెనుకకు నడిచేలా కదలటం ఈ కాలు ప్రత్యేకత. దీనిని విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది.













