ఇస్రో సైంటిస్టుల భూరి విరాళం

ఇస్రో శాస్త్రజ్ఞులు తమ ఇంజనీరింగ్ ప్రతిభతో దేశ ప్రతిష్టను ఆకాశపు అంచులు దాటిన అంతరిక్షం వరకూ తీసుకువెళ్లారు. మరో వైపు వారి దానగుణం అంతకు మించిన సమున్నత శిఖరాలకు వారిని చేర్చింది. చంద్రయాన్ ప్రాజెక్టులో ల్యాండర్ విక్రమ్ రూపశిల్పిగా ఘనత వహించిన డాక్టర్ పి.వీరముత్తువేల్ ఓ వైపు తన ఇంటి రుణాలు తీర్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ రెండేళ్ల తన వేతానాన్ని దానం చేశారు. తమిళనాడు ప్రభుత్వం వీరముత్తు ప్రతిభకు గుర్తింపుగా ఈ పాతిక లక్షలకు గాంధీ జయంతి రోజున పారితోషికంగా అందించింది. అయితే తన వ్యక్తిగత రుణాలను తీర్చుకోవడానికి బదులుగా ఆయన వీటిని తాను చిన్ననాట చదువుకున్న విద్యా సంస్థలకు కానుకగా అందించేందుకు సిద్ధం అయ్యారు. మరో సైంటిస్టు డాక్టర్ ఎం శంకరన్ ఇప్పుడు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డెరెక్టర్‌గా ఉన్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా అందినపాతిక లక్షల రూపాయలను తాను కేరళలో చదువుకున్న కాలేజీలకు వితరణ చేశారు.