భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం…
దేశంలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబందనలు పాటించాలని పేర్కొంది. వలస కార్మికులు దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ లాక్డౌన్ విధిస్తారని భయంతో కార్మికులంతా మళ్లీ ఇళ్లకు పనయమవుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరలా వారి వారి రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కరోనా కట్టడికి ఈ చర్యలు తీసుకుంది.













