అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్ల తర్వాత
కరోనా కారణంగా భారత్లో గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే ఆ ఆంక్షలను కేంద్రం ఇటీవల ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేటినుంచి భారత్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలను సాగించనున్నాయి. విమాన సిబ్బంది ఇకపై పీపీఈ కిట్లు ధరించనక్కర్లేదని, అయితే విమానాశ్రయాల్లో విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని కేంద్ర పౌర విమాన మంత్రిత శాఖ పేర్కొంది. విమానాల్లోను, ఎయిర్ పోర్టుల్లోనూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. దాంతోపాటే అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మూడు సీట్లను ఎమర్జెన్సీ అవసరాల కోసం ఖాళీగా ఉంచాలన్న నిబంధననను కూడా కేంద్రం విధించింది. నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుకలు కేంద్రం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఎయిర్ లైన్స్ సంస్థలు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.













