మిఠాయిలు పంచుకొన్న భారత్, పాక్ సైనికులు

రంజాన్ సందర్భంగా జమ్మూ కశ్మీర్‍లోని నియంత్రణ రేఖ వద్ద కుప్వారా, ఉరీ సెక్టార్లలో భారత్, పాకిస్థాన్ సైనికులు పరస్పరం మిఠాయిలు ఇచ్చి పుచ్చుకున్నట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమే ఈ కార్యక్రమం జరిగినట్లు పేర్కొన్నారు. పెద్ద పండగలతో పాటు ఆయా దేశాల జాతీయ పండగల సందర్భంగా ఇలా మిఠాయిలు పంచుకోవడం సంప్రదాయం.