చెలరేగిన టీమిండియా.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం
అన్ని విభాగాల్లో చెలరేగిన టీమిండియా.. వరల్డ్ కప్‌లో వరుసగా 9వ విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. బ్యాటర్లు చెలరేగడంతో 410 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51), శ్రేయాస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాముల్ (102) అందరూ అద్భుతంగా ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది టీమిండియా. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ తడబడింది. మ్యాక్స్ ఓ దౌద్ (30), కోలిన్ ఆకర్మన్ (35), సైబ్రాండ్ ఎంగెల్బ్రెట్ (45), తేజ నిడమనూరు (54) రాణించినా కూడా.. కొండంత లక్ష్యం ముందు వీరి ప్రదర్శన చిన్నబోయింది. దీంతో ఆ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాలో ఏకంగా 9 మంది ప్లేయర్లు బౌలింగ్ చేశారు. వారిలో ఆరుగురు ప్లేయర్లకు వికెట్లు దక్కడ గమనార్హం. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో రెండు వికెట్లతో రాణించారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ చెరో వికెట్ తీసుకున్నారు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













