అరుదైన ఘనత… ప్రపంచంలోనే టాప్

ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‍సీ) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే టాప్ రీసెర్చ్ యూనివర్సిటీగా నిలిచింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో ఈ విషయం వెల్లడైంది. ఇక ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ టాప్ 200 యూనివర్సిటీల్లో చోటు దక్కించుకోగా ఇండియాలో బెస్ట్ కాలేజీలుగా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. ఐఐటీ గౌహతికి కూడా ఈ లిస్టులో చోటు దక్కడ విశేషం. సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ సూచిక ఆధారంగా ఐఐఎస్‍సీకి ఈ టాప్ ప్లేస్ దక్కింది. లండన్‍కు చెందిన క్యాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) రూపొందించిన ఈ మెట్రిక్‍లో ఐఐఎస్‍సీకి 100కు 100 మార్కులు రావడం విశేషం. ఇక టాప్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐఎస్‍సీకి 186వ స్థానం దక్కింది. ఇండియాలో ఐఐటీ బాంబే, ఢిల్లీ తర్వాత మూడో బెస్ట్ యూనివర్సిటీగా ఐఐఎస్‍సీ నిలిచింది.
ఐఐటీ బాంబే తాజా ర్యాంకుల్లో 117వ స్థానం సంపాదించింది. ఈసారి కూడా ఇండియాలో బెస్ట్ కాలేజ్‍గా నిలిచినా గతేడాది 172వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే ఈసారి ఐదు ర్యాంకులు కోల్పోయింది. అటు ఐఐటీ ఢిల్లీ మాత్రం 193వ స్థానం నుంచి 185కు ఎగబాకింది. ఈ క్రమంలో ఐఐఎస్‍సీకి వెనక్కి నెట్టింది.