హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకెళ్లిన ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 5 నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. తనను తప్పుడుగా ఇరికించారని, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కుతున్నారని, జైలు నుంచి విడుదలైన అనంతరం హేమంత్ ఆరోపించారు. సోరెన్‌ను చూసేందుకు జేఎంఎం శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. మద్దతు తెలిపిన వారికి, న్యాయవ్యవస్థకు హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ ధన్యవాదాలు తెలిపారు.