పంజాబ్ సీఎంకు మరోసారి బెదిరింపులు. రిపబ్లికన్ డే రోజున
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి హద్దు మీరాడు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, డీజీపీ గౌరవ్ యాదవ్‌లను హత్య చేస్తానని బెదిరించాడు. గణతంత్ర దినోత్సవం రోజున సీఎంపై దాడి చేసేందుకు గ్యాంగ్స్టర్లు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. గ్యాంగ్స్టర్లకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మాన్కు ఈ బెదిరింపులు వచ్చాయి. భారత్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలపై దాడులు చేస్తామంటూ ఇటీవల తరచూ పన్నూ బెదిరింపులకు దిగుతున్నాడు. వీటిని తీవ్రంగా పరిగణిస్తోన్న కేంద్రం ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది.













