మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్

మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నేత హెచ్.డి. దేవెగౌడ్‍కు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. 2011 జూన్‍లో ఓ కన్నడ వార్త ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నంది ఇన్‍ఫాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‍ప్రైజ్‍పై దేవెగౌడ్ వ్యాఖ్యలు చేశారు. పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ సదరు సంస్థ ప్రతినిధులు కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం నంది ఇన్‍ఫాస్ట్రక్చర్‍కు రూ.2 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దేవెగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు.
ఇదే కేసులో గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కాగా, నష్టపరిహారంగా దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు ఎన్‍ఐసీఈ కంపెనీ డిమాండ్ చేసింది. ఇక ఇన్‍ఫాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‍ప్రైజ్‍పై ఇంటర్వ్యూలో చేసిన తన వాదనను ధృవీకరించడంలో దేవగౌడ విఫలమయ్యారని కోర్టు తేల్చింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని వినియోగించిందని గౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో దేవెగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.