ఫేస్‍బుక్, గూగుల్ కొత్త ఐటీ రూల్స్… పాటించాల్సిందే

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ ను పాటించాల్సిందేనని ఫేస్‍బుక్, గూగుల్ సహా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలకు పార్లమెంటరీ ప్యానెల్ మరోసారి తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలను, ప్రభుత్వ సూచనలను ఆయా కంపెనీలకు మళ్లీ వివరించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీ ముందు ఫేస్‍బుక్, గూగుల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఫేస్‍బుక్ నుంచి కంపెనీ దేశ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ థుక్రాల్, జనరల్ కౌన్సిల్ నమ్రత సింగ్ కమిటీ ముందుకు రాగా, గూగుల్ తరపున కంపెనీ ఇండియా హెడ్ అమన్‍జైన్, లీగల్ వ్యవహారాల డైరెక్టర్ గీతాంజలి దుగ్గల్ హాజరయ్యారు. దేశంలోని ప్రజల హక్కులను కాపాడడం సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేయడమే అజెండాగా పార్లమెంటరీ కమిటీ భేటీ అయ్యింది.