నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్
వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టు ఘనవిజయం సాధించింది. నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 339 పరుగుల భారీ స్కోరు చేసింది. బెన్ స్టోక్స్ (108), డేవిడ్ మలాన్ (87), క్రిస్ వోక్స్ (51) అద్భుతంగా రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడ్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఛేజింగ్ మొదలైన తర్వాత పిచ్ నుంచి స్పిన్నర్లకు గ్రిప్ లభించింది. దీంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. తేజ నిడమనూరు (41 నాటౌట్) మినహా ఎవరూ క్రీజులో కనీసం కుదురుకోలేకపోయారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (38), వెస్టీ బరేసీ (37), సైబ్రాండ్ ఎంగిల్బ్రెట్ (33) తమకు దక్కిన ఆరంభాలను ఉపయోగించుకోలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయీన్ అలీ, అదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. సెంచరీతో చెలరేగిన బెన్ స్టోక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













