ఈసీ మరో కీలక నిర్ణయం… కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాలంటే
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు.. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలనుకునే అభ్యర్థులు, వారి ఏజెంట్లు కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి. లేదా రెండు డోసుల టీకా తీసుకున్నట్లు ఆధారాలు చూపించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. అయితే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే కంటే 48 గంటల ముందు చేయించినది అయి ఉండాలని నిబంధన విధించింది. అంతకంటే ముందు రిపోర్టు చూపించడానికి వీల్లేదు ప్రకటించింది. అభ్యర్థులు కౌంటింగ్ రోజున హాజరయ్యే ఏజెంట్లకు సంబంధించిన లిస్ట్ ను మూడు రోజుల ముందుగానే అధికారులకు అందించాలని తెలిపింది.













