ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం.. మరో వారం రోజుల పాటు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‍డౌన్‍ను పొడిగిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‍డౌన్ గడువు మే 3వ తేదీ ఉదయం 5 గంటల ముగియనుంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రోజుకు 25 వేలకు మించకుండా నమోదు అవుతుండటంతో లాక్‍డౌన్‍ను మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలో కరోనా విజృంభించడంతో ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 26 వరకు పూర్తి స్థాయి లాక్‍డౌన్ విధిస్తున్నట్లు గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. అయినప్పటీకీ కేసుల్లో ఎలాంటి తగ్గుదల లేకపోవడంతో మే 3వ తేదీ వరకు పొడిగించారు. తాజాగా మరో వారం పాటు లాక్‍డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు దాదాపు 25 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వందల మంది వైరస్‍కు బలవుతున్నారు.