ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆథారిటీతో వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఢల్లీి లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ.500 జరిమానా విధించనున్నట్లు వెల్లడిం చింది. అలాగే పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. అయితే వైరస్ కట్టడికి నిపుణులతో చర్చించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తామని పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.













