భారత్ కు బాసటగా నిలిచిన దలైలామా

కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్‍కు ఆధ్యాత్మిక గురువు దలైలామా బాసటగా నిలిచారు. పీఎం-కేర్స్ కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టుకు సూచించారు. కరోనా ప్రభావం ప్రపంచమంతా ఉన్నది. ముఖ్యంగా భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ కష్టకాలంలో భారత్‍కు అండగా నిలువాలని నిర్ణయించాం. ఈ మహమ్మారి నుండి ప్రపంచం త్వరలోనే బయట పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని దలైలామా పేర్కొన్నారు.