వీరప్ప మొయిలీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం
కాంగ్రెస్ నేత, రచయిత ఎం వీరప్ప మొయిలీకి సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక పురస్కారంగా పిలిచే సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2020 సంవత్సరానికి గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఆయనతో పాటు ప్రుమఖ కవియిత్రి అరుంధతీ సుబ్రమణ్యమ్తోపాటు మరో 18 మందికి కూడా ఈ అవార్డు లభించింది. శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం పేరిట కన్నడలో మొయిలీ రచించిన ఇతిహాస కావ్యానికి, వెన్ గాడ్ ఇజ్ ఏ ట్రావెలర్ పేరిట ఇంగ్లీష్‌లో అరుంధతి రాసిన కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించినట్టు అకాడమీ పేర్కొంది. 20 భాషలకు చెందిన ఏడు కవితా పుస్తకాలకు, నాలుగు నవలలకు, ఐదు చిన్న కథలకు, రెండు నాటకాలకు, ఒక వృత్తాంతానికి, మరొక ఇతిహాస కావ్యానికి ఈ అవార్డులను ప్రకటించినట్టు వివరించింది. ఈ అవార్డులతో పాటు 21 మందికి బాలసాహిత్య పురస్కారాలు, 18 మందికి యువ పురస్కారాలను సాహిత్య అకాడమీ ప్రకటించింది.













