కరోనాకు గుడి కట్టారు…

కరోనా మహమ్మారి త్వరగా అంతమవ్వాలని కోరుకుంటూ తమిళనాడులో ఏకంగా కరోనాకు ఓ గుడినే కట్టారు. కోయంబత్తూరు నగర శివార్లలోని ఇరుగూర్‍లో కామాచ్చిపురంలో ఇది జరిగింది. కరోనాదేవి పేరిట ఒకటిన్నర అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా నెలకొల్పి పూజలు చేస్తున్నారు నిర్వాహకులు. 48 రోజుల పాటు మహాయజ్ఞం చేస్తామని, ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. గతంలో ప్లేగు వ్యాధి (1900లలో) సంభవించినప్పుడూ ఇక్కడ మరియమ్మన్ ఆలయం నిర్మించారని తెలిపారు. తదనంతర కాలంలో ఇది అక్కడి ప్రజల ఆరాధ్య దైవం కూడా అయింది.