కపిల్ సిబల్ కు కంగ్రాట్స్ చెప్పిన సీజేఐ చంద్రచూడ్

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ కంగ్రాట్స్ తెలిపారు. ఎస్సీబీఏ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నామని, మీ సహకారం కోసం ఎదురుచూస్తున్నామనీ సీజేఐ తెలిపారు. సీజేకి కూడా సిబల్ థ్యాంక్స్ చెప్పారు. 22 ఏళ్ల తర్వాత బార్ అసోసియేషన్‌కు పనిచేసే అవకాశం తనకు దక్కినట్లు తెలిపారు. మీకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని సిబల్ పేర్కొన్నారు.