కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన… ఆలాంటి ప్రకటనలకు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పోంజీ యాప్‌ల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్టుబడిదారుల కష్జారితాన్ని దోచేస్తున్న పోంజీ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు మైటీ, ఆర్బీఐతో కలసి పనిచేస్తున్నట్టు తెలిపారు. పెట్టుబడులు పెట్టేముందు తగినంత శ్రద్ధ చూపించాలని, అద్భుతమైన రాబడులు ఇస్తామంటూ చేసే ప్రకటనలకు ఆకర్షితులు కావద్దని కోరారు. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా పోంజీ యాప్‌లు ఉంటున్నట్టు చెప్పారు. పోంజీ యాప్‌లను బ్లాక్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (మైటీ), ఆర్బీఐతో కలసి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సామాజిక ప్రభావ వీలురు, ఆర్థిక ప్రభావ శీలురను నియంత్రించే ప్రతిపాదన ఏదీ లేదంటూ మనలో ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రతి దానినీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలన్నారు. ప్రతి 10 మందిలో ముగ్గురు మంచి సూచనలే చేస్తున్నారంటూ, మిగిలిన ఏడుగురిని ఇతర ప్రభావాలు నడిపిస్తుండొచ్చన్నారు.













