మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనాథ పిల్లల ప్రయోజనాల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు. కొవిడ్‌తో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వన్నుట్లు తెలిపారు. అయితే దాని ప్రీమియం పీఎం కేర్స్ ద్వారా చెల్లించబడుతుందని తెలిపారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇద్దరిని కోల్పోయిన 18 యేళ్ల వయసున్న పిల్లలు నెలవారీ స్టైఫండ్ అందుకుంటారని కేంద్రమంత్రి తన ట్వీట్‌తో తెలిపారు. ఇక 23 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి 10 లక్షల రూపాయలు మొత్తం ఇవ్వబడుతుందని తెలిపారు.













