ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చకు సిద్ధమే : కేంద్రం
జాతుల వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్ లో ఉద్త్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష పార్టీలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నాయని సమాచారం. ఈ క్రమంలో కేంద్రం నుంచి స్పందన వచ్చింది. తాము పార్లమెంట్ లో మణిపుర్ అంశంపై చర్చించేందుకు సిద్దమని వెల్లడించింది. వర్షాకాల సమావేశాలకు ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మణిపుర్ గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా జరుగుతోన్న ఈ ఘర్షణల్లో 80 మందికి పైగా మృతి చెందారు.













