కేంద్ర కీలక నిర్ణయం.. ఆ 14 యాప్స్ బ్లాక్
అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదులకు పాక్ నుంచి సందేశాలు వచ్చేయని పేర్కొంది. నిషేధించిన యాప్‌లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్ఆర్ఎంఈ, మీడియాఫైర్, బ్రియర్, బీచాట్, నాండ్‌బాక్స్, కొనియన్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి, త్రీమా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని తమ సహచరులకు సందేశాలు పంపేందుకు ఈ యాప్‌లను వినియోగిస్తున్నారని కేంద్రం గుర్తించింది. పలు పరిశోధనా సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ క్రమంలో కేంద్రం యాప్‌లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.













