తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్!
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కి.మీల మేర డబ్లింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో డోన్-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ (మొత్తంగా 502.34 కి.మీ) మధ్య డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది. బారాంగ్, కుర్దా రోడ్-విజయనగరం వరకు 417.6 కి.మీల మేర రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్‌కు ఆమోదముద్ర వేసింది.













