ట్విటర్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు… ఈ నెల 18న
కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విట్టర్‌పై గురి పెట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 18న హాజరుకావాలని ట్విటర్‌కు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించకపోవడంతో ట్విటర్‌పై మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇటీవల తుది నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. పదే పదే నోటిసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంతో ట్విటర్ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై)లోని సైబర్ లా గ్రూప్ కో ఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు ఫేక్‌న్యూస్ నివారణ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.













